ఈ మధ్య ఉద్యోగాలు దొరకక యువత తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుని మంచి ఉద్యోగంలో చేరాలని ఆశిస్తున్నారు. కానీ ఈ మధ్య రకరకాల రౌండ్స్ కి బాగా టాలెంట్ ఉన్న వారు కూడా నెగ్గుకు రాలేకపోతున్నారు.
ఇంటర్వ్యూ లో సరిగా పెర్ఫాం చెయ్యని కారణంగా మంచి ఉద్యోగంలో చేరలేకపోతున్నారు. అసలు చేసే ఉద్యోగానికి, ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్నలకి సంబంధమే ఉండట్లేదు.
బికాం చదివినవాళ్ళకి, బియస్సీ చదివినవాళ్ళకి ఒకటే రౌండ్స్. వారి చదువులు వేరు కాబట్టి దానికి సంబందించిన ప్రశ్నలు అడగకుండా ఏవేవో ప్రశ్నలు కావాలని రిజెక్ట్ చెయ్యడానికా అన్నట్టు సాగుతున్నాయి ఇంటర్వ్యూలు.
కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళైతే ఇలా ఇంటర్వ్యూలకి వెళుతూనే ఉన్నారు. విక్రమార్క ప్రయత్నం లాగ ............
- మన మనిషి