Sunday, 30 September 2012

విక్రమార్క ప్రయత్నం

ఈ మధ్య ఉద్యోగాలు దొరకక యువత తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుని మంచి ఉద్యోగంలో చేరాలని ఆశిస్తున్నారు. కానీ ఈ మధ్య రకరకాల రౌండ్స్ కి బాగా టాలెంట్ ఉన్న వారు కూడా నెగ్గుకు రాలేకపోతున్నారు. 

ఇంటర్వ్యూ లో సరిగా పెర్ఫాం చెయ్యని కారణంగా మంచి ఉద్యోగంలో చేరలేకపోతున్నారు. అసలు చేసే ఉద్యోగానికి, ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్నలకి సంబంధమే ఉండట్లేదు. 

బికాం చదివినవాళ్ళకి, బియస్సీ చదివినవాళ్ళకి ఒకటే రౌండ్స్. వారి చదువులు వేరు కాబట్టి దానికి సంబందించిన ప్రశ్నలు అడగకుండా ఏవేవో ప్రశ్నలు కావాలని రిజెక్ట్ చెయ్యడానికా అన్నట్టు సాగుతున్నాయి ఇంటర్వ్యూలు. 

కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళైతే ఇలా ఇంటర్వ్యూలకి వెళుతూనే ఉన్నారు. విక్రమార్క ప్రయత్నం లాగ ............

- మన మనిషి 



Friday, 28 September 2012

ఎప్పుడు చదువులో ముందుండే రాహుల్ సడెన్ గా డల్ అయిపోయాడు.

ఎప్పుడు చదువులో ముందుండే రాహుల్ సడెన్ గా డల్ అయిపోయాడు. దేని మిద శ్రద్ద పెట్టలేకపోతున్నాడు. అన్నం తినట్లేదు. నిద్ర పోవట్లేదు. ఇంట్లో వాళ్లతో సరిగా మాట్లాడట్లేదు.


కారణం అతనిష్టంగా పెంచుకున్న పిల్లి చనిపోవడం. ఇలాంటి పరిస్థితిలో రాహుల్ మళ్ళి మామూలు పరిస్థితులుల్లోకి రావాలంటే ఏం చెయ్యాలి.


ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది.

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. 

సమస్యలతో బాధ పడితే పరిష్కారం వైపు మనసు ఆలోచించదు.

ఆశావాదంతో మన ప్రయత్నం మనం చెయ్యాలి.

మనం అనుకున్న వారితో పంచుకుంటే పరిష్కార మార్గాలు తెలుస్తాయి.

మరెందుకాలస్యం, సమస్య ఏదైనా చర్చిద్దాం. పరిష్కార మార్గాలు అన్వేషిద్దాం.

- మన మనిషి 

Monday, 17 September 2012

సలహాలు మనకోసం

సలహాలు మనకోసం అనే బ్లాగ్ ఉద్దేశ్యం 

ఏదైనా మంచి పని చేయ్యదలచినప్పుడు నలుగురిని అడిగి మంచి చెడులు తెలుసుకుని ఆ పనిని ప్ర్రారంభిస్తాం. అంటే, మనం సలహా కోరుకున్నట్టే కదా. 
ఈ  బ్లాగులో ఆరోగ్య చిట్కాలు, వంటింటి చిట్కాలు, ఇంటింటి చిట్కాలు లాంటివి భోలేడు.
మీరు కూడా మీ సమస్యను చర్చించవచ్చు.

ఈ బ్లాగ్ ద్వారా నాకు తోచిన సలహాలు నేనిస్తాను. లేదా మీ ప్రశ్న చదివినవారెవరైనా సలహా ఇవ్వొచ్చు.

ఇట్లు,
మన మనిషి